![]() |
![]() |
.webp)
జబర్దస్త్ వేదిక ద్వారా ప్రేమించుకున్న జంట రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత. అయితే మొదట్లో వీరిద్దరిదీ రీల్ లవ్ అనుకున్నారు అంతా. షోకి రేటింగ్ కోసం చేస్తున్నారని అనుకున్నారు. కానీ తర్వాత తమది రియల్ లవ్ అని చెప్తూ ఒక రియాలిటీ షోలో సుజాతకు రింగ్ తొడిగి మరి ప్రపోజ్ చేశాడు రాకింగ్ రాకేష్. ఇక ఇప్పుడు రాకేష్ సుజాతతో, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. "జీవితం అంటే ఏమిటో తెలియాలంటే స్మశానానికి వెళ్ళాలి అంటారు నేను కూడా అలాగే స్మశానానికి వెళ్లాను, సుజాతను కూడా తీసుకెళ్ళాను..కొంత మంది ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్లా.ఐతే ఈ విషయం తెలిసి సుజాత వాళ్ళ అమ్మ నా మీద కోప్పడ్డారు కూడా. తర్వాత మా అమ్మ నన్ను కాశీ తీసుకెళ్ళేసరికి అక్కడ ఉన్న ఒక గురువుగారు నాకు మంచి ఉపదేశం ఇచ్చి వయసుకు తగ్గట్టు వ్యవహరించమని చెప్పారు. అలా నా దారి మార్చుకున్నాను.
ఇక చిన్నప్పటినుంచి నన్ను, తమ్ముడిని అమ్మే సాకింది. ఎందుకంటే మా నాన్న ఉన్నా కూడా లేనట్టే. నాకంటే ముందు తమ్ముడికి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తమ్ముడి కూతురు ఇంట్లోకి అడుగుపెట్టింది. ఏదైనా బాధ్యతను అప్పగించినప్పుడు అందరినీ అలా చూసుకోవడం అలవాటు చిన్నప్పటినుంచి అందుకే ఎవరి విషయంలోనైనా బాద్యతగానే ఉంటాను. భార్యాభర్తల మధ్యన ఉండాల్సింది ఆకర్షణ కాదు.ఒకరి పద్ధతులు ఒకరు యాక్సెప్ట్ చేసుకునే గుణం ఉండాలి. నేను తనను ఎంత కేర్ గా చూసుకుంటానో నన్ను అలాగే చూసుకుంటుంది సుజాత .. టైం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. నా మనసు మారినందుకు మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది. సుజాత మా అమ్మతో బాగా కలిసిపోతుంది. సుజాత వాళ్ళ నాన్నగారు నాకు పెద్ద ఫ్యాన్. అందుకే తాను మా ఇంటికి వస్తుంది నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను " అంటూ సుజాతతో తనకున్న రిలేషన్ గురించి చెప్పాడు రాకింగ్ రాకేష్.
![]() |
![]() |